Harish Rao : రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది
- ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం : మాజీ మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని తెలుస్తున్నది.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందన్నారు.
అంతేకాకుండా..’అంబర్‌పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే, ఆరు నెలల క్రితం హత్యకు గురైన బీఆర్‌ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘోర నేరాలకు ఇప్పటికీ న్యాయం దక్కకపోవడం శోచనీయం. తెలంగాణలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదు . రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31%గా ఉంది, ఇది బీహార్‌లో లాంటి రాష్ట్రాలతో పోటీపడి పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఘటన జరిగిన మొదటి వారం గోల్డెన్ పీరియడ్‌గా భావించబడుతున్నది . అయితే, ఆ సమయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదు, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని,శక్తిని కోల్పోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం.
మరోవైపు, ప్రజా భద్రత గురించి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు, రాజకీయ దాడులకు పాల్పడడం దుర్మార్గం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారు. సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తే వేధింపులకు గురిచేస్తారు.
ఆఖరికి పేరు మర్చిపోతే కూడా కేసులు పెట్టి వేధిస్తారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకోకుండా ప్రజల భద్రత కోసం ల్యాండ్ ఆర్డర్ సంరక్షణ కోసం పోలీస్ శాఖను వాడితే బాగుంటుంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి మెరుగైన లా అండ్ ఆర్డర్ నిర్వహించేందుకు ప్రభుత్వం సకాలంలో పోలీస్ శాఖ బడ్జెట్ విడుదల చేసి పోలీస్ బలగా బలోపేతం చేయాలి. చిల్లర రాజకీయాల కంటే ప్రజల భద్రత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలి వేగవంతమైన న్యాయాన్ని అందించాలి కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఉపయోగించకూడదు.’ అని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు