Harish Rao : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో…
Uttam Kumar Reddy: ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాలసీ అర్థం కాక చేస్తున్నారా..? కావాలని చేస్తున్నారో అర్థం కావడం లేదు.. ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కూడా కాదని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద విద్యుత్ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు నిన్న(బుధవారం) ఆరోపించారు. రామగుండం, పాల్వంచ, మక్తల్‌లలో మూడు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించాలని రాష్ట్ర…
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
KCR: ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ' ఉద్యమ గీత రచయిత, డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
Kavitha: మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం హరీష్‌రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కవిత అంత్యక్రియలకు హాజరుకాలేదు. దీనితో హరీష్‌రావుతో ఉన్న విభేదాల కారణంగానే రాలేదని అనేక ఊహాగానాలు చెలరేగాయి. అయితే మూడు రోజుల తర్వాత, గురువారం ఉదయం కవిత హరీష్‌రావు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకున్నారు.
KCR: మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందిన విషయం తెలిసిందే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. తన బావ తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి హరీష్‌రావుని కౌగిలించుకుని ఓదార్చారు.
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన రజకుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదిస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు మాట్లాడుతూ.. “మంత్రి కూతురు చెప్పిన ‘తుపాకీ కథ’ ఇప్పటికీ తేలలేదని.. ఆ తుపాకీ…
మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిరణ్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎవరి గుబ గుయ్యిమంటుందో హరీష్ రావుకి తొందరలోనే తెలుసుకుందేమో. లక్ష ఇల్లు ఎక్కడ కట్టారు? ఎవరికిచ్చారు? హరీష్ రావే చెప్పాలి” అని అన్నారు. అధికారం చేతిలో ఉండగా, ఇష్టానుసారంగా నాళాలను చెరువులుగా మార్చి, కబ్జాలు చేశారు అని ఆయన విమర్శించారు. చిన్న వానే పడితే హైదరాబాద్‌లో సరిగా తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, దానికి కారణం ఎవరు అనేది హరీష్…
ఏపీకి హైఅలర్ట్.. రాబోయే మూడు రోజులు ఎక్కడికి వెళ్లొద్దు.. మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ…