CM Chandrababu:కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచడం ద్వారా రైతులకు ఆదాయం పెంచడంపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు… సాగులో పురుగుమందుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు… రైతు గౌరవం దేశ గౌరవమన్నారు. ఆచార్య ఎన్జీ రంగా 125 జయంతి ఉత్సవాలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబుతోపాటు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు పాల్గొన్నారు. యూనివర్సిటీలో…
CM Chandrababu at Acharya N.G. Ranga 125th Birth Anniversary: ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీ రంగా దేశ స్వాతంత్య్ర పోరాటంలో, రైతాంగ ఉద్యమంలో, గ్రామీణ అభివృద్ధిలో చేసిన విశేష సేవలను గుర్తుచేశారు. “ఆచార్య ఎన్జీ రంగా 125వ…
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
Tummala Nageswara Rao : వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు రైతుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచాయి. ప్రస్తుతంగా రైతుల అవసరాలపై, పథకాల అమలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలనకు వస్తే, ప్రభుత్వం రైతుకు తోడుగా నిలుస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రైతుల రుణ భారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. “రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు. కానీ…
Tummala Nageswara Rao : రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రైతుబంధు రూ. 7600 కోట్లు చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ ఇచ్చే స్థితిలో కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు రైతులకు అన్ని వనరులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, అధికారులను అక్కడికే…
NEET : జూన్ 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరీక్షను ఒక్కే షిఫ్ట్‌లో నిర్వహించాల్సి ఉండటంతో, తగిన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు NBEMS పేర్కొంది. త్వరలోనే పరీక్ష కోసం కొత్త తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించింది. Chennai Love Story : కిరణ్…
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి…
CM Chandrababu: పంటలకు గిట్టుబాటు ధరల నిర్ధారణ, రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటలు, ధరలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘంతో కలిసి సమీక్ష నిర్వహించిన ఆయన, వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ ముందే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితిని విశ్లేషించి ఏ పంటలు సాగు చేయాలో సూచించాలని సీఎం పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా కృషి…