Poguleti Srinivas Reddy : జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో శనివారం జరిగిన “భూభారతి 2025” చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద రైతులకు మహా ప్రసాదంగా నిలుస్తుందని చెప్పారు. పొంగులేటి ధరణి చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ, అది కొద్ది మంది వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని…
Uttam Kumar Reddy : తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి 57 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల నుంచి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, పౌర సరఫరాల శాఖా ముఖ్య…
Duddilla Sridhar Babu : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే BRS పార్టీ నిరంతరం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం BRS పార్టీకి అలవాటైందని ఆయన అన్నారు. మంత్రి మాట్లాడుతూ, ఇటీవల ప్రైవేట్ వ్యక్తుల పేరిట జరుగుతున్న వ్యవహారంపై సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. “కోర్టు తీర్పు…
Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, భవిష్యత్తులో BRS అధికారంలోకి రావడంపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ BRS పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “సింగిల్‌గా అధికారంలోకి వచ్చేది…
MLC Kavitha : నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ తోఫా నిలిపివేయడం, సీఎం రేవంత్ రెడ్డి తీరు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను నిలిపివేయడం ముస్లిం సోదరుల హక్కులకు భంగం కలిగించే విషయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఇచ్చే సహాయాన్ని…
ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఊరట కల్గించేలా ఈ మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ…