Ponguleti Srinivas Reddy : కేబినెట్ కీలక నిర్ణయాలు.. ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ..
- రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం
- కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్‌లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు
- ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద మొత్తంలో వరి దిగుబడి రాలేదు
- రికార్డుస్థాయిలో ఈసారి వరిసాగు అయ్యింది
- కేంద్రం సహకరించినా, లేకపోయినా ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తాం
- మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తాం. -మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని పొంగులేటి అన్నారు.
Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం రైతును నిజమైన రాజుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇక, కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా పాలన ఉత్సవాల నిర్వహణ కోసం సబ్‌కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
నల్సార్ యూనివర్సిటీకి అదనంగా 7 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. అదే విధంగా, మెట్రోరైలు రెండో దశ 2ఎ, 2బి విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా, దానిపై కొర్రీలు వేసినట్లు తెలిపారు. మెట్రో విస్తరణకు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 5565 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి ₹10,547 కోట్లు మంజూరు చేసి, హ్యామ్ మోడ్‌లో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గుంతల మయమైన రోడ్లు మరమ్మతు కానున్నాయని తెలిపారు. అలాగే కృష్ణా – వికారాబాద్ రహదారి కోసం ₹438 కోట్లు, 835 హెక్టార్ల భూమి సేకరణకు కేటాయింపు చేశారు. మరోవైపు మున్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కి ₹7,500 కోట్లు కేటాయిస్తూ 75 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా రంగ విస్తరణతో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు