బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు. చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లి ఉండే వాడిని కాదా? అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చిన.. నీ మాదిరి మోసం చేయలే అని విమర్శించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేయలేదని.. బనకచర్ల పై చర్చ కోసం కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాయాలన్నారు. తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని.. కేసీఆర్ హయాంలో ఏపీ ముచుమర్రి కట్టారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసింది కూడా మీ హయాంలోనే అన్నారు.
READ MORE: Perni Nani: చంద్రబాబు, పవన్, లోకేష్‌పై పేర్నా నాని తీవ్ర వ్యాఖ్యలు..
అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిపై సీఏం రేవంత్ ప్రసంగించారు. “పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో ప్రజలకు లెక్క చెప్పు.. దేని మీద నువ్వు చర్చకు వస్తావ్ కేసీఆర్ అని నేను అడుతున్న.. 1లక్ష 4 వేల కోట్ల రూపాయలతో రైతును రాజును చేసిన ప్రభుత్వం మాది. వ్యవసాయం అంటే రైతుకు సాయం చేయడం. కాళేశ్వరం పేరుతో కమిషన్లు తీసుకున్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పాము. ఆదిశగా మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించాము. ప్రజా పాలనలో అందరూ భద్రంగా ఉండాలని చూస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. 18 ఏళ్ల మా పాలనపై ఎక్కడికక్కడ చర్చ పెట్టండి. పదేళ్లలో ఏ ప్రాజెక్టులు చూసిన పూర్తి చేయాలే. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది. లక్ష కోట్లు వృధా అయ్యాయి. చిన్న కాళేశ్వరం లో నిన్ను ఉరేసినా తప్పులేదని రైతులు అంటున్నారు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
“గోదావరి నీటి పై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చ చేద్దాం. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరో ఆధారాలు సహా చెబుతా. అప్పుడంటే పెద్దలు జానారెడ్డి నీతో ఎందుకులే అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. నువ్వు అసెంబ్లీకి రా.. నీ సంగతి చూస్తాం. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి విక్రమార్కకు సూచిస్తున్నా. రాబోయే మరో ఐదేళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీనే. ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించండి.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు