Tummala Nageswara Rao : రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న రైతుబంధు రూ. 7600 కోట్లు చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ ఇచ్చే స్థితిలో కూడా లేని పరిస్థితి నుంచి, ఇప్పుడు రైతులకు అన్ని వనరులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, అధికారులను అక్కడికే వెళ్లొద్దని ఆదేశించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపోయిన రైతులకు నేరుగా పరిహారాలు అందించామని చెప్పారు. వ్యవసాయ యాంత్రికీకరణ, పంటల భీమా, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కేంద్రం 2,500 కోట్లు ఆపేయడాన్ని విమర్శించారు. గతంలో రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా 2014లో ప్రకటించి 2018లో సగం మందికే చెల్లించిందన్నారు.
Sajjala Ramakrishna Reddy: జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం.. అడ్డుకుంటే కోర్టుకు పోదాం..
ప్రస్తుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం రూ. 40,683 కోట్ల వ్యయం చేసి, మద్దతు ధరలు కల్పించిందన్నారు. సన్న రకాలకు ఎకరాకు రూ. 500 బోనస్ ప్రకటించి, పీడీఎస్ ద్వారా పంపిణీ ద్వారా పేద రైతులకు మేలు చేసినట్లు వివరించారు. కందులు, సోయాబీన్, జొన్న వంటి పంటల దిగుబడుల పరిమితిని పెంచి ప్రభుత్వమే కొనుగోలు చేసిందని తెలిపారు. రైతు భీమా కొనసాగిస్తూ, 2023 కంటే ఎక్కువ మంది రైతులను భీమా పరిధిలోకి తీసుకురాగలిగామని చెప్పారు. రైతుల ప్రీమియంలను కూడా ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు. మట్టి పరీక్షలు, శిక్షణ కార్యక్రమాలు, డ్రిప్ పరికరాల పంపిణీ వంటి అన్ని పథకాలు పునరుద్ధరించామన్నారు.
బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి రైతు పేరుతో విషప్రచారం చేస్తున్నారని, ఇది ప్రజలు నమ్మే స్థితిలో లేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. గత పదేళ్లలో రైతు సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చిన వారే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం సిగ్గుచేటన్నారు.
IPL 2025 Final: కొత్త ఛాంపియన్ ఎవరు..? ట్రోఫీతో ఇరుజట్ల కెప్టెన్స్.. ఫొటోస్ వైరల్