కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ రూపంలో ఈరోజు వరకు 1,199 కోట్ల రూపాయలు రైతులకు ప్రజా ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. రైతన్నకు ఊహించని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రైతు బీమా పథకాన్ని అమలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు భీమా అందించామని స్పష్టం చేశారు.
READ MORE: Iran- Israel: ట్రంప్ సీస్‌ఫైర్ విఫలం.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడులు..!
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని.. మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు. “నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నాం.
ప్రతి పాఠశాల 25 ఎకరాల్లో.. 200 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నాం. మొదటి సంవత్సరం 58 పాఠశాలలు నిర్మించేందుకు 11,600 కోట్లు కేటాయించాంరాష్ట్రంలోని 3.10 కోట్ల మంది పేదలకు ఉగాది నుంచి సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. సన్న బియ్యం కోసం ప్రతి సంవత్సరం 13,525 కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలోని సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇందుకుగాను తాజా బడ్జెట్లో 23,373 కోట్లు కేటాయించాం.” అని భట్టి వ్యాఖ్యానించారు.
READ MORE: Shashi Tharoor: బీజేపీలో చేరికపై శశిథరూర్ ఏమన్నారంటే..!