CM Revanth Reddy: మీది 40 ఏళ్ల అనుభవం.. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం..
- ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రండి
- మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని చెప్పండి
- పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా?
- మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాము
- ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలి
- ఏ రోజు నేను సీఎంగా అహంకారానికి పోలేదు
- మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు చెప్పండని కోరారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. మేము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. ఏ రోజు తాను సీఎంగా అహంకారానికి పోలేదని చెప్పారు. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని.. ప్రపంచంలో తెలంగాణని గొప్ప రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
READ MORE: West Bengal: ‘‘ అమ్మా.. నేను దొంగని కాదు, చిప్స్ దొంగిలించలేదు’’.. 12 ఏళ్ల బాలుడి సూసైడ్ నోట్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసాని 12 వేలకు పెంచి సహాయం అందిస్తున్నామని చెప్పారు. భూమి లేని రైతులకు కూడా సహాయం అందిస్తున్నామని తెలిపారు.. వరి వేసుకుంటే ఉరే అని ఆనాటి సీఎం అన్నారని.. కానీ నేడు వరి పంటకు బోనస్ ఇస్తున్నామన్నారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం 5500 కోట్లు కేటాయించామని.. కోటి మంది మహిళలను కొటేశ్వరులు చేయాలన్నదే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వచ్చిన వారు మన ఆడబిడ్డలు చేసిన వస్తువులను చూశారన్నారు.. మహిళలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇందిరమ్మని ఆదర్శంగా తీసుకుని సోనియమ్మ స్పూర్తితో ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని భరోసా ఇచ్చారు.
READ MORE: Singer Kenisha : జయం రవి విడాకులు.. నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు..
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న యువతకు గత పదేళ్లుగా ఉద్యోగాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందున్న అన్న వ్యక్తి ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నామని.. మీ అందరూ అండగా ఉంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం ప్రధాని మోడీని ఎన్ని సార్లు అయిన కలుస్తామని స్పష్టం చేశారు. చెరువు మీద అలిగితే మనకే వాసన వస్తుందని.. ఒకాయన అలాగే అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని తీవ్రంగా విమర్శించారు. నేను మీ కోసం పని చేస్తా… కష్టపడుతానన్నారు.
READ MORE: IndiGo Fligt Incident: ఇండిగో విమాన ఘటన.. పాక్‌కి సింధూ నీళ్లు ఆపడంలో తప్పే లేదు..
అలాగే సీఎం రేవంత్‌రెడ్డి జగ్గారెడ్డి గురించి మాట్లాడారు. “జగ్గారెడ్డి భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తారు. వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పజెబుతున్నా. వారికి మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు ఇస్తారు. జహీరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు…ఆ తర్వాత అభివృద్ధి మన అజెండా. సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ నారాయణఖేడ్ కి రెండు కళ్ళలాంటి వారు. పటాన్ చెరు మినీ ఇండియా ప్రాంతం. BHEL, BDL, NIMZ, ఇక్రిశాట్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినవే.. సింగూరు నుంచి మంజీరా జలాలు హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్ గా మారుస్తాం.” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!