ఏపీ వ్యసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. కోనసీమలో క్రాప్ హాలీడే గురించి ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలు రాజకీయ హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు. వీళ్ళు క్రాప్ హాలీడే అని దుష్ప్రచారం చేస్తున్నారు.సీఎం పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల్లో మొదటి హామీ రైతు భరోసా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తే అణచి వేశారు. కరువు మండలాలు టీడీపీ హయంలోనే ఎక్కువగా…
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్లసూర్యప్రకాష్ రెడ్డి. కర్నూలు జిల్లా కోడుమూరులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గడప గడపకు వెళ్లే ధైర్యం లేక.. పోలీసుల సాయం తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చేందుకు ముద్దులు పెట్టాడు..ఇపుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం చేసింది శూన్యం.. అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యం గురించి చెబుతాం అన్నారు. వేదవతి, ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టు పనులను టీడీపీ…
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…