మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం…
కరీంనగర్ జిల్లాలో మా సంఘం స్థాపన జరిగింది.మాకు సంఘం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టిఆర్ వికెఎస్) తెలిపింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలా చెప్తే అలా చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి, చీఫ్ విప్ గా కొప్పుల కావడంతో వారి స్థానంలో కల్వకుంట్ల కవితను పెట్టుకుందాం అని మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. కల్వకుంట్ల కవితను మేము ఒప్పించి 2015…
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన విమర్శలను పుట్ట మధు ఖండించారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. కవిత ఏనాడు ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు…
టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఇక స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చేందుకు మంచిరోజు కోసం చూస్తున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే సోమవారం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖ ఇస్తారని తెలుస్తోంది. స్పీకర్ ను కలిసి ఇవ్వడమా? లేక ఫ్యాక్స్ లో పంపడమా? అనే అంశంపై ఈటల తన అనుచరులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా లేఖ ఆమోదం తర్వాత ఈటల బీజేపీలో చేరనున్నారు. చేరిన తరువాత…
టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీస్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్‌కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడటంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతుండటంతో బీజేపీ-టీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం సీఎం కేసీఆర్ కు నష్టమేనని అన్నారు. తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్తపడాలని నారాయణ సూచించారు. అలాగే ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి కూడా…
బీజేపీలో చేరాలన్న ఈటెల నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం అన్నారు సీపీఎం తమ్మినేని వీరభద్రం. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై కువిమర్శలు చేయడం అభ్యంతరకరం. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రజాకంటక పాలన సాగిస్తున్నది. లౌకిక విలువలను గంగలో కలిపి మతోన్మాద రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపి లాంటి ప్రమాదకర పార్టీని…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీపీఐ నేత చాడా వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్‌కు రాజీనామా సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈటల పచ్చి అవకాశవాదని వ్యాఖ్యానించిన చాడా… మతోన్మాద పార్టీ (బీజేపీ)లో చేరుతూ సీబీఐ మీద నిందలు వేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు… టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే మా పార్టీ కార్యాలయాన్నే ధర్నా చౌక్‌గా మార్చిన చరిత్ర సీపీఐది అన్న ఆయన.. అసైన్ భూములు…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌కు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను పంపనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని… బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్…. ఇప్పుడు…