పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు మీడియా సమావేశం నిర్వహించారు. ఈమేరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత, సంతోష్ రావులపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన విమర్శలను పుట్ట మధు ఖండించారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. కవిత ఏనాడు ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన ఉంది, ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు కవితను గౌరవ అధ్యక్షురాలు ఎన్నుకున్నారు. ప్రజల కోసం పనిచేస్తుంటే పదవులు అవే వస్తాయి. ఈటెల రాజేందర్ చేసిన విమర్శలు తిరిగి వెనక్కి తీసుకోవాలి. సంతోష్ కుమార్ పార్టీ అభివృద్ధికి, తెలంగాణ ఆవిర్భావ కోసం ఎంతో కృషి చేశారు. ఈటల రాజేందర్ పై వచ్చిన ఆరోపణలపై జవాబు చెప్పాలి, కానీ ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయరాదన్నారు. కవితకు సంపూర్ణ మద్దతు ఉంటుంది, ఆమె నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు. వారి నాయకత్వంలో పనిచేస్తామని పుట్ట మధు తెలిపారు.