Off The Record: తెలంగాణ కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కి రాదా? ఎడ్డెమంటే తెడ్డెమనే నైజం మారదా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓ వైపు డిపాజిట్ కూడా దక్కకుండా జనం కర్రుగాల్చి వాత పెట్టినా.
Etela Rajender: బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని తెలిపారు.
బతుకమ్మ వేడుకల సందర్భంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మను తీసుకెళ్లిన అనుభవం ఉందని గుర్తుచేసిన ఆమె, ప్రస్తుతం తెలంగాణలో సోయి లేని ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆత్మగౌరవం, దేశభక్తి విలువలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Off The Record: తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా అడపా దడపా కొన్ని చోట్ల స్థానిక కమిటీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ… ఇంకొక్క విషయంలో మాత్రం పీటముడి గట్టిగానే బిగుసుకుపోయినట్టు కనిపిస్తోంది. పార్టీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉంటే… 36 చోట్లే అధ్యక్ష ఎన్నిక పూర్తయింది. ఆయా జిల్లాల్లో కమిటీలు కూడా దాదాపుగా పడ్డాయి. ఇక అనుబంధ కమిటీలు, అధికార ప్రతినిధుల నియామకం కూడా త్వరలోనే…
Etela Rajender : మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా రాష్ట్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిన ఆయన సమస్యలపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ, మల్కాజిగిరి ఎంపీ పరిధిలో పేదలకు కేటాయించాల్సిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సమస్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో తప్పిపోయిన పేదల జాబితాను మంత్రి…
Etela Rajender : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హాయంలో బీసీ శాతం 23 కు పడిపోయిందని ఆయన మండిపడ్డారు. బీసీల కళ్లలో మట్టి కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీఅని, బీఆర్ఎస్ పార్టీకి…
నలుగురు….. ఎస్, ఆ నలుగురు నాయకులు. ధిక్కార స్వరాలను ఓ రేంజ్‌లో వినిపిస్తున్నారు. ఆ సౌండ్‌తో వాళ్ళున్న పార్టీలకు సైతం గూబ గుయ్‌మంటోంది. తమ హాట్ హాట్ కామెంట్స్‌తో, చేతలతో తెలంగాణ సమాజం మొత్తాన్ని తమవైపు తిప్పుకుంటున్నారు. అధిష్టానాలకు కంట్లో నలుసులా, నిత్య తలనొప్పిగా మారిన ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు? ఏంటి వాళ్ళ కథా, కమామీషు? సొంత పార్టీ అగ్రనేతల్నే టార్గెట్ చేస్తాడు. కేంద్ర మంత్రి అయినా…, రాష్ట్ర అధ్యక్షుడు అయినా.. ఆ నోటికి ఒక్కటే.…
చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు ఉపన్యాసం హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1996, 99 ఎన్నికల సమయంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు రెండు సార్లు శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబుదే.. 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించిన ఘనుడు కూడా చంద్రబాబే.. హంద్రీనీవా ప్రాజెక్టు…
Etela Rajender : మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా స్ట్రీట్ ఫైట్ రాదు అని, మీదికి ఒక మాట, లోపల మరో మాట మాట్లాడటం నాకు అలవాటు లేదన్నారు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు అని ఆయన అన్నారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి, వాటిని తట్టుకున్నా. 2021 నుండి BRS లో నరకం అనుభవించా. ప్రజలు…