కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.. అయతే, నిన్న హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. అసలు లాక్‌డౌన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.…
మరికొన్ని నెలల్లో వరంగల్‌లో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 65వ డివిజన్ తెరాస అభ్యర్థి గగులోతు దివ్య తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారన్నారు.…
రాష్ట్రంలో కరోనా టెస్ట్ కిట్ల కొరత లేదు అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మన దగ్గర పేషేంట్లకు సరిపడా బెడ్స్ ఉన్నాయి, టీకాలు, మందులు ఉన్నాయి అని చెప్పిన ఆయన చికిత్స కు ముందుగా వచ్చిన వారు బతుకుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఆక్సిజన్ కొరత లేదు. 80 టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తున్నాం. ఏ కొంచెం లక్షణాలు ఉన్నా డాక్టర్స్ ని కలవాలి. ఏ టెస్ట్ చేసినా కరోనా పాజిటివ్ వస్తోంది. టెస్టుల ఫలితాలు…