కరీంనగర్ జిల్లాలో మా సంఘం స్థాపన జరిగింది.మాకు సంఘం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టిఆర్ వికెఎస్) తెలిపింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలా చెప్తే అలా చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి, చీఫ్ విప్ గా కొప్పుల కావడంతో వారి స్థానంలో కల్వకుంట్ల కవితను పెట్టుకుందాం అని మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. కల్వకుంట్ల కవితను మేము ఒప్పించి 2015 లో మా సంఘం గౌరవ అధ్యక్షురాలుగా నియమించుకున్నాం. మా సంఘంకి కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలు అయ్యాక అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి.కేసీఆర్ కు నేరుగా మా సమస్యలను చెప్పి సీఎంను ఒప్పించారు మా ఉద్యోగులకు ఎన్నో సమస్యలు తీర్చారు ,మాకు ప్రమోషన్ లకు సంబంధించి కూడా స్పందించి ఒప్పించారు.
కానీ ఈటల రాజేందర్ ఇలాంటివి ముందు ముందు మాట్లాడవద్దు. ఇకనైనా ఆయన ఆ పని మానుకోవాలని సూచిస్తున్నాము. ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీ నుండి బయటకు వెళ్లి ఇలాంటి నిరాదరమైన ఆరోపణలు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. కవిత పై తప్పుడు ఆరోపణలు మంచిది కాదు .ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు పూర్తిగా అవాస్తవం