బీజేపీలో చేరాలన్న ఈటెల నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యం అన్నారు సీపీఎం తమ్మినేని వీరభద్రం. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై కువిమర్శలు చేయడం అభ్యంతరకరం. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రజాకంటక పాలన సాగిస్తున్నది. లౌకిక విలువలను గంగలో కలిపి మతోన్మాద రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తు కోసం బిజెపి లాంటి ప్రమాదకర పార్టీని ఎంచుకోవటం శోచనీయం. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే తెలంగాణ ప్రజల లౌకిక వారసత్వాన్ని గౌరవించినవారవుతారు అని పేర్కొన్నారు.