పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల భట్టితో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని..లెఫ్ట్ భావజాలాలు ఉండి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడో తెలియదని చురకలు అంటించారు. కేంద్ర రక్షణ కోసం ఈటల బీజేపీ వైపు వెళ్ళారని..ఎవరు అధికారంలో ఉంటే అటు పోవడం నాయకులకు అలవాటు అయ్యిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని.. సాగర్ లో ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీశారు. తెలంగాణలో ఇంత గలిజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని..ఇలాంటి…
ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల…
వచ్చే వారమే బీజేపీలో చేరుతానని ఈటల పేర్కొన్నారు. నేను వామపక్ష, లౌకిక వాదిని… కానీ పరిస్థితులు తనను బిజేపి వైపునకు తీసుకెళ్ళాయని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ? రాష్ట్రంలో సీపీఐ పార్టీ పోటీలో ఉండాలా లేదా అన్నది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ? అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రయతించిందని… ఇప్పటికే హుజురాబాద్ నియోజవర్గంలో టిఆర్ఎస్ 50 కోట్లు…
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కారు గుర్తు, గులాబీ జెండా గుర్తుతో గెలిచిన విషయాన్ని మంత్రి ఈటెల రాజేందర్ గుర్తుంచుకోవాలని… తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పని చేశారని… వారంత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించారని పేర్కొన్నారు. అందులో ఈటెల ఒక్క కార్యకర్త మాత్రమే…టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 2003 లో ఈటెల జాయిన్ అయ్యారని చురకలు అంటించారు. కేసీఆర్ తమ నాయకుడు అని.. ఆయన నాయకత్వంలో పని చేసేందుకు నియోజక వర్గ ప్రజాప్రతినిధులు,…
ఈటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు ఈటల. అయితే ఈటల వ్యాఖ్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ప్రయత్నాలు ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమేనని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మందిని కెసిఆర్ నాయకులుగా తయారు చేశారని.. అనామకుడు ఇచ్చిన ఫిర్యాదుపై సిఎం కెసిఆర్ స్పందించారంటే అది నియంతృత్వం…
టీఆర్ఎస్ బహిస్కృత నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్‌రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే…
టీఆర్ఎస్ కు దూరం అయిన మాజీ మంత్రి ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ కావటంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. హుజురాబాద్ లో ఉపఎన్నిక తప్పదనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన గులాబీ పార్టీ.. పూర్తి పట్టు కోసం వేగంగా పావులు కదుపుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థే గెలిచేలా ఇప్పటికే నేతలు బాధ్యతలు తీసుకోని గ్రౌండ్ లెవల్ లో తమ పనిని మొదలుపెట్టేశారు. ఈటెల బీజేపీలోకి వెళ్లడం ఖాయం…
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈటల విషయంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఎప్పుడు ఏ చర్య అవసరం అనుకుంటే ఆ చర్య తీసుకుంటారని ప్రకటించారు. ఇక, ఈటల ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన బహుజన వాదం, వామపక్ష వాదం ఎక్కడికి పోయిందని ప్రశ్నించిన రాజేశ్వర్‌రెడ్డి.. 40 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకున్నానని ఈటల స్వయంగా ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.. వైఎస్, రోషయ్య, కిరణ్…