ఈటలతో భేటీ కన్నా ముందు సంజయ్ తరుణ్ చుగ్ లతో సమావేశం అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పరిస్థితిలపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమ కారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మరో సారి నడ్డా దృష్టికి తీసుకెళ్లారు సంజయ్. ఉద్యమ కారులకు మనం అండగా ఉండాలని కోరిన సంజయ్.. ఈటల పై కావాలనే ఆరోపణలు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. ఈటలతో పాటు ఇంకా ఇబ్బంది పడుతున్న ఉద్యమ కారులు…
ఈటల బీజేపీలో చేరికపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలన్న కిషన్ రెడ్డి… నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తాడు. బండి సంజయ్, నాతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారు. ఈటల చేరికను ముఖ్యనేతల సహా.. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలి. అసంతృప్తులు సహజం. సీనియర్ నేత పెద్దిరెడ్డి…
రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి వెళ్లారు. ఈటల రాజేందర్ అంశం పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ చుగ్ తో ఇప్పటికే బండి మాట్లాడారు. ఇక రేపు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, ఢిల్లీ పెద్దలను ఈటల కలవనున్నారు. ఈటల రాజేందర్…
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇటీవల అన్ని పార్టీల ముఖ్యనేతలతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈటల ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. బీజేపీలో చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ తో పాటే తెలంగాణ…
టీఆర్ఎస్ పార్టీలో ఈటల అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి… ఇవాళ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని చేనేత సహకార సంఘం భవనంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు.. అయితే, ఈ సమావేశంలో జై ఈటెల నినాదాలను హోరెత్తించారు కొందరు కార్యకర్తలు.. మండల స్థాయి టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వ్యాఖ్యానించడంతో.. ఈటల వర్గీయుల్లో…
ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బిజేపిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ ఈటల నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. ఈటల బిజేపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో…
తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన వ్యక్తులతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల్ని కలిశారు. దీంతో ఈటల కాంగ్రెస్‌లో లేక బీజేపీలో చేరుతారా లేక కొత్త పార్టీని పెడతారా అంటూ రకరకాల చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే, ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్తలకు, ఇటీవలే జరిగిన పరిణామాలు…
డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ బీసీ కమిషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. అందులో మాట్లాడుతూ… ఆత్మ గౌరవం వ్యాపారాలు పెంచుకోవడమేనా అని ఈటలను ప్రశ్నించారు. మీ వెంట ఎవరూ లేరు ఓడిపోతారని భయంతో రాజీనామా చేయడం లేదు. అధినేత కేసీఆర్ పై తప్పుడు వ్యాఖ్యలు మానుకోండి ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు. తెరాస తరఫున గెలిచి స్థానిక సంస్థల ప్రతినిధులు తెరాసలో కొనసాగడం అమ్ముడుపోవడం ఎలా అవుతుంది. పార్టీలో ఉండి అధినేతపై పార్టీ పై…
ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన నన్ను కలిసేందుకు సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ ఇప్పటి వరకు ఈటల నన్ను కలవలేదు అని తెలిపారు. ఆయన నేను కలిసి 15 ఏళ్ళు కలిసి పనిచేసాం… ఇప్పుడు కలిస్తే తప్పేంటి అని అన్నారు. మేము కలిసినంత మాత్రానా పార్టీ లో చేరేందుకు అనుకోలేము. ఎప్పుడు కలుస్తామన్నది ఇంకా నిర్ణయించుకోలేదు. అందరినీ కలుస్తున్నా మిమ్మల్ని కూడా కలుస్తా అని నాతో చెప్పాడు…