సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు. కొందరు నాయకులు తొత్తుగా వ్యవహరిస్తున్నారని.. వారిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో ఆత్మగౌరవానికి ఛాన్స్ లేదని ఆయన పేర్కొన్నారు. అంతిమ విజయం ఎప్పుడు ప్రజలదేనని స్పష్టం చేశారు. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటారని.. కెసిఆర్ కు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఉద్యమ కారులేవరో, ఉద్యమ ద్రోహులేవరో ప్రజలు తేల్చుకుంటారని తెలిపారు. కాగా ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అటు టీఆర్ఎస్ కూడా ఈటలను ఒంటరి చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా ట్రబల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దించింది టీఆర్ఎస్.