టీఆర్ఎస్‌కు ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఈటల ఎపిసోడ్ తెరపైకి రాగానే తమ నేతలు, ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో పడిపోయింది టీఆర్ఎస్.. మరోవైపు.. ఈటల వెంట వెళ్లి రాజీనామా చేసినవాల్లు కూడా ఉన్నారు.. అయితే, ఈటల తమ నేతలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో డబ్బులను వెదజల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని ఈటల గ్రహించాలంటూ హితవు పలికారు హుజూరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక.. టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈటల రాజేందర్ పై వ్యవహారశైలిపై ధ్వజమెత్తారు.. గత మూడు రోజులుగా ఈటల తన అనుచరులను.. పార్టీ ప్రజాప్రతినిధుల వద్దకు పంపి డబ్బుల ఆశ చూపి తన వైపు లాక్కోవాలని ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు..
ఈటల ప్రలోభాలకు లొంగేవారెవరూ టీఆర్ఎస్‌లో లేరని.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న ఈటల.. ప్రజల్లో చులకన అయ్యారని వ్యాఖ్యానించారు.. తనకు 200 ఎకరాలు ఉందని.. ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికను ఎదుర్కుంటానంటూ ఈటల ప్రకటించిన తీరును ప్రజలు గమనించారన్న రాధిక.. డబ్బులు చూపితే వెళ్లేవారు ఎవరు లేరనేది ఆయన గుర్తుంచుకోవాలని హితవు పలికారు.. పార్టీ టికెట్ పై గెలిచిన ప్రజాప్రతినిధులు అందరూ పార్టీ లైన్ లో ఉంటే ఈటల రాజేందర్ మాత్రం పార్టీ డబ్బులు ఇచ్చి తనకు దూరం చేసారని ఆరోపిస్తున్నారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల డబ్బులకు ఆశపడేవారు ఎవరూలేరని, సంక్షేమ అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ కు శ్రీరామ రక్ష అని, ప్రజలంతా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనే ప్రయత్నాలను మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు హుజూరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక.