మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇవాళ ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించిన ఆయన.. అనంతరం అసెంబ్లీకి వెళ్లి.. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను అందజేశారు.. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలేఖను సమర్పించారు ఈటల రాజేందర్… ఇక, ఇప్పటికే బీజేపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసిన ఈయన.. ఈనెల 14నవ తేదీన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ…
తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే నా అజెండా అని ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పటికే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. ఇవాళ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికలు కురుక్షేత్రంగా అభివర్ణించారు.. అక్కడ కౌరవులు, పాడవులకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు.. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని ఈ సందర్భంగా…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన ఎమ్మెల్యే పదవికి అఫిషియల్‌గా రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించనున్నాడు. అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రమే ఈటల ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.…
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…
రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్‌లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని..…
వైఎస్ షర్మిల కొత్తపార్టీని ఇప్పటికే ప్రకటించింది. కొత్త వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీని పెట్టబోతున్నారు. కాగా ఈరోజు షర్మిల కొత్త పార్టీ గురించి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. కేసులకు భయపడి ఈటల రాజెందర్ బీజేపీలో చేరుతున్నారనీ, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం కామన్ అయిందని అన్నారు. ఈటల తమ పార్టీలోకి వస్తామంటే తప్పకుండా ఆహ్వనిస్తామని, ఇప్పటి వరకు ఈటలతో ఈ విషయంపై చర్చించలేదని అన్నారు.…
ఈటల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతా అని బీజేపీలో చేరడం ఎంటో అర్దం కావడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస అవినీతికి రక్షణగా నిలిచింది బీజేపీ. ఈటల బీజేపీలో కలుస్తారని నేను ఊహించలేదు. ఆయన బలహీనత బయట పడింది. ఈటల బీజేపీలో చేరుతూ తన వ్యక్తిత్వం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ నీ ఎవడో నడపడు. కాంగ్రెస్ నీ నడిపిస్తుంది రాహుల్ గాంధీ. ఈటల స్థాయిని స్వయంగా ఆయనే తగ్గించుకున్నారు. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడు.…
సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ డబ్బులు, దౌర్జన్యంతో గెలవలేడని, ఇది కౌరవులు, పాండవుల మధ్య జరిగే యుద్ధం అని పేర్కొన్నారు. 19 సంవత్సరాలు గులాబీ జెండాను మోసానని.. కష్టకాలంలో అండగా ఉన్న నన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహులను మాత్రం పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు. రూ. 100 కోట్లతో బ్లాక్ మెయిల్ చేసినా తనను ఎవరూ కొనలేరు అని ఈటల పేర్కొన్నారు.…