టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఇక స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చేందుకు మంచిరోజు కోసం చూస్తున్నట్టు సమాచారం. అన్ని కుదిరితే సోమవారం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా లేఖ ఇస్తారని తెలుస్తోంది. స్పీకర్ ను కలిసి ఇవ్వడమా? లేక ఫ్యాక్స్ లో పంపడమా? అనే అంశంపై ఈటల తన అనుచరులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా లేఖ ఆమోదం తర్వాత ఈటల బీజేపీలో చేరనున్నారు. చేరిన తరువాత తన సమక్షంలో పార్టీలో చేరే వారిపైనా కూడా ఈటల కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆపై హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్దంచేసుకుంటున్నారు. ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా హుజురాబాద్ ఉపఎన్నికకు సిద్దమవుతుంది.