Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడలో మంగళవారం భద్రతా బలగాలకు, నక్సల్స్‌కి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 09 మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉదయం. 10.30 గంటలకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ నంబర్ 2 , భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. చనిపోయిన నక్సల్స్ మృతదేహాలను, లోడింగ్ రైఫిల్స్ 303, 12 బోర్ వెపన్స్ తో సహా అనేక ఆయుధాలను సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు భద్రతా సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు.
జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని బస్తర్ రేంజ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ తెలిపారు. బస్తార్ ప్రాంతం దంతేవాడ, బీజాపూర్, సుకుమా, నారాయణపూర్, కొండగావ్, సుకుమా, జగదల్‌పూర్ వంటి జిల్లాలను కలిగి ఉంది. ఈ ప్రాంతం నక్సల్స్‌కి కంచుకోటగా ఉంది.