పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.
ఇది కూడా చదవండి: US: భారతీయ స్కాలర్ బాదర్ ఖాన్‌కు ఊరట.. బహిష్కరణను అడ్డుకున్న కోర్టు
ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం నిఘా ఆధారిత ఆపరేషన్ నిర్వహించినట్లు సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తీవ్రమైన ఎదురుకాల్పుల్లో దళాలను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ హస్నైన్ అక్తర్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అక్తర్ చాలా ధైర్యవంతుడని.. సాహసోపేతమైన చర్యలకు అక్తర్ చాలా ప్రసిద్ధి చెందిన వాడని సైన్యం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: KTR : తెలంగాణ పరిశ్రమల అంశంపై కేటీఆర్ విమర్శలు
2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం వచ్చిన దగ్గర నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ సరిహద్దు ప్రావిన్సులో ఉగ్రవాద చర్యలు ఎక్కువయ్యాయి. దీంతో పాక్ దళాలు.. భీకరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జనవరి, 2025 నుంచి ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. అయితే ఈ ఉగ్రవాదులు.. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని పాక్ సైన్యం ఆరోపించింది.
ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్ 2025 విజేత ఎవరు?.. గ్రోక్ సమాధానం ఇదే!