Chhattisgarh: మరోసారి ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం నక్సలైట్లు , భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్‌లో 25 లక్షల రివార్డ్ కలిగిన టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో ఉదయం 8 గంటలకు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ బస్తర్ ఎరియాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 100 మంది నక్సలైట్లు హతమయ్యారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తించిన నక్సలైట్‌ని తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన DKSZCM (దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు) సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళిగా గుర్తించారు. మిగిలిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నారు.
Read Also: Betting Apps : బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు.. ఎవరెవరు ఏయే యాప్ లు ప్రమోట్ చేశారంటే..?
సంఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు ఇన్సాస్, 303, 315 రైఫిల్స్ సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరింత ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 20న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మరణించిన ఈ ప్రాంతంలో వారం రోజుల్లోనే రెండో ఎన్‌కౌంటర్ జరిగింది.