ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా… మావోలు మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం అయ్యారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi: “లేడీ పవర్ స్టార్” సాయి పల్లవికి అనారోగ్యం..
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Rammohan Naidu : బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రభావం.. ఇప్పటికే 15వేల కోట్లు..
#UPDATE | Chhattisgarh | 8 naxals have been killed in an ongoing encounter between security forces and Naxals in the jungle under Gangaloor PS limit. Search operations are underway: Police officials https://t.co/MRrRx9rVqF
— ANI (@ANI) February 1, 2025