అమరావతిలో వైసీపీ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. ప్రతి ఇంటికీ మహిళలు కొలికపూడికి మంగళ హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను కొలికపూడి ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేయండి.. తిరువూరిని అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు.
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన చేవెళ్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి శుక్రవారం విడుదల చేశారు. తనను గెలిపించడం ద్వారా.. నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదేళ్లలో చేయనున్న పనులను సంకల్ప పత్రం పేరిట ప్రజల ముందుకు తీసుకొచ్చారు. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ సంకల్ప పత్రాన్ని మీడియాకు వివరించారు. చేవెళ్లను దేశంలో…
మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గుంటూరులోని ఆటోనగర్ లో గురువారం నాడు సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. బుధవారం (ఏప్రిల్ 24) శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188…
ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైపీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తేన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.