ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం నాడు పర్యటించారు.
కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. 2018లో యువ నాయకుడు నారా లోకేష్ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో మదర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆ మండలంలోని అన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్లతో నీటిని సరఫరా చేశారని తెలిపారు.
ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ముందు వరుసలో నిలబెట్టిన తనను గెలిపించే బాధ్యత ప్రజలదైతే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యత తనదని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
శుక్రవారం రోజు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్వతనగర్, వివేకానంద నగర్, తులసినగర్, గాయత్రి నగర్, జనప్రియ నగర్‌లో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.. నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ... మరొక అవకాశం ఇవ్వాలని కోరుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి, మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జగన్మోహనరావు కోరుతున్నారు. పూలతో, హారతులతో మహిళలు, ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో.. నేతలు ప్రచార జోరు పెంచారు. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగానే.. ఖమ్మం పార్లమెంట్ స్థానం తరుఫున గురువారం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామరెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన తరుఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి…