ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. ప్రతి ఇంటికీ మహిళలు కొలికపూడికి మంగళ హారతులు, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలను కొలికపూడి ప్రజలకు వివరించారు. తిరువూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తాను.. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేయండి.. తిరువూరిని అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. అనంతరం.. తిరువూరు పట్టణంలో 19వ వార్డులో మేదర సంఘానికి చెందిన 300 మంది ప్రజలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కాలనీ వాసులతో కలిసి తన దైన స్టైల్ లో మాస్ స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు.
Malla Reddy: రాజేందర్ అన్న నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
అనంతరం మేదర సంఘం వారు మాట్లాడుతూ.. తమకు ఇళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని కొలికపూడికి చెప్పుకున్నారు. దీంతో.. మీ అందరికి త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా.. ఓ ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తామన్నారు. మీ అందరూ ఓట్లు టీడీపీకి వేసి గెలిపించాలని కోరారు. మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను, మీకు ఏ కష్టం రాకుండా చూసుకొని బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతానని తెలిపారు.
Sandeshkhali: సందేశ్‌ఖాలీలో విదేశీ ఆయుధాలు, బాంబులు.. స్వాధీనం చేసుకున్న సీబీఐ..
మరోవైపు.. 19 వార్డులో డ్రైనేజీ వ్యవస్థ బాగలేక ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అని వార్డు ప్రజలు కొలికపూడి శ్రీనివాసరావుకు తెలిపారు. దీంతో.. డ్రైనేజీ పూడిక తీపించండి అని మున్సిపల్ అధికారులకు చెప్పారు. ఎలక్షన్ కోడ్ ఉంది.. ఇప్పుడు మేము చేపించలేము అని మున్సిపల్ అధికారులు తెలపడంతో.. వెంటనే స్పందించిన కొలికపూడి డ్రైనేజీలో దిగి జేసీబీ, ట్రాక్టర్ తెప్పించి డ్రైనేజీలో పూడిక తీపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరువూరు నియోజకవర్గంలో అత్యంత ప్రధాన సమస్యలు రెండు ఉన్నాయి.. ఒకటి త్రాగునీరు, రెండు డ్రైనేజీ అని అన్నారు. తిరువూరులో డ్రైనేజ్ సమస్య వల్ల ప్రజలు డెంగ్యూ, మలేరియా లాంటి విషపూరిత జ్వరాలకు గురి అవుతున్నారన్నారు. ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ అధికారులు డ్రైనేజీ సమస్యపై ఎటువంటి చర్యలు తీసుకోలేక పోతున్నారు. వారిని గౌరవిస్తూ ఈరోజు 19వ వార్డులో అక్కపాలెం రోడ్ లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం స్వయంగా తాను ఈరోజు డ్రైనేజీలో దిగి డ్రైనేజీ శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మంచి రోడ్లు త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి తిరువూరును మంచి పట్నంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.