జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కాకర్ల సునీల్ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు. కాకర్ల సునీల్ మాట్లాడుతూ.. ప్రజాసేవకులైన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ విజయానికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందించి.. సైకిల్ గుర్తుకు ఓటు వేయడంతో పాటు పది మంది చేత ఓట్లు వేయించి కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Read Also: EVM- VVPT: ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఆ పిటిషన్లు కొట్టివేత!
అలాగే, ఉదయగిరి మండలం సున్నం వారి చింతల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ జెడ్పీ చైర్మన్ పి చంచలబాబు యాదవ్ ఇంటింటికి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. మహిళలు హారతులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. చంచల బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే అభివృద్ధితో పాటు మన పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also: Ileana D’Cruz : ఎట్టకేలకు పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ఇలియానా..?
ఇక, కొండాపురం మండలం గొట్టి గుండాల బీసీ కాలనీలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. అదే విధంగా బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలతో పాటు జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా చేసిన సేవా కార్యక్రమాలు, అలాగే, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర సురేష్ రెండు సంవత్సరాలు పాటు అందించిన సేవా కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజా సేవకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.