గుంటూరులోని ఆటోనగర్ లో గురువారం నాడు సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఆటోనగర్లో ఎన్నో ఏళ్లుగా నీటి సౌకర్యాలు అందుబాటులో లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే నీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. నాయకులతోనూ సంప్రదించి ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గుంటూరు ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
Read Also: Warangal Mgm Hospital: మార్చురీలో పనిచేయని ఫ్రీజర్లు.. కుళ్లిపోతున్న మృతదేహాలు
అలాగే, గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ.. ఆటోనగర్ అభివృద్ధి చేస్తామంటూ పదేళ్ల పాటు ఎమ్మెల్యే కాలయాపన చేశారన్నారు. గెలిచిన తర్వాత ఒక్క సారి కూడా ఆటోనగర్ వైపు తొంగి చూడలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు.
Read Also: KKR vs PBKS: నేడు కోల్‌కతాతో పంజాబ్ కింగ్స్ ఢీ.. ఈ మ్యాచ్కు ధావన్ దూరం..
ఇక, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలోని జెముడుపాడు, జముడుపాడు పాలెం, చక్రాయపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చిన కొద్దినాళ్ళలో రైతులకు సాగు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఎవరి తాత, ముత్తాతల ఆస్తులపై ఎవరి ఫోటోలు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారు. ఇక నాదేండ్ల మనోహర్ మాట్లడుతూ.. జనసైనికులు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసు అన్నారు. అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని తెలిపారు.