Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే, బీజేపీ గురించి తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు ప్రారంభించిన ‘‘Know BJP’’ ప్రచార కార్యక్రమంలో భాగంగా 7 దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం ఆదివారం బీహార్ సందర్శిస్తోంది.
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ లో ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే…
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మహా కూటమి శుక్రవారం తన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనికి “బీహార్ కా తేజస్వి ప్రణబ్” అని పేరు పెట్టారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో విడుదల చేసిన ఈ మానిఫెస్టోలో, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని మహా కూటమి హామీ ఇచ్చింది. ఈ మేనిఫెస్టో కేవలం ఎన్నికల వాగ్దానాలు మాత్రమే కాదని, బీహార్ పునర్నిర్మాణానికి ఒక బ్లూప్రింట్ అని మహా కూటమి పేర్కొంది.…
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని నరేంద్రమోడీ దిగారు. బీహార్‌లోని బీజేపీ కార్యకర్తలతో ప్రధాని గురువారం మాట్లాడుతూ.. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ మరో 100 ఏళ్లు అయినా మరిచిపోలేమని, ఆ కాలపు అనుభవానలు యువతరానికి అందించాలని రాష్ట్రంలోని సీనియర్ ఓటర్లను ఆయన కోరారు
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Anji Reddy Chinnamail: ఉమ్మడి కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాలకు హామీ ఇచ్చింది.. హామీలను నెరవేర్చడం విఫలమైందని ఆరోపించారు.
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. కాగా పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పోటీచేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 271 పట్టణాలు, 499 పోలింగ్ బూత్ లున్నాయని తెలిపారు. ఏ…