టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గురువారం నాడు సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కొనసాగాయి.
గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని చూసి ఒక్కసారి తనకు ఓటు వేస్తే.. ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.
గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన కాంగ్రెస్ జెండా వదలని ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు.
G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ప్రతిసారి పదవిలో ఉన్న ఐదేళ్ళు ఏం చేశానో ప్రజలకు నివేదిక ఇస్తున్నానని తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంది వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి.
దేశ ప్రజలకు ఒక్కటే గ్యారంటీ.. అది మోడీ గ్యారంటీ తప్ప వేరే ఏ గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని బ్రహ్మ లింగేశ్వర టీ పాయింట్ దగ్గర చాయ్ పే చర్చలో ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు.