Amit Shah: బీజేపీ అగ్రనేత అమిత్ షా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది.
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కే పురం, టెలిఫోన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారాన్ని దించాలంటే కాంగ్రెస్కు చురకలు పెట్టాల్సిందేనని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మేడలు వంచుతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా, గెలిచినా.. ప్రభుత్వం పడిపోదని తెలిపారు. అహంకారం మత్తులో ఉన్న కాంగ్రెస్ ను ఓడించాలని దుయ్యబట్టారు. రైతుబంధు, ఆరు గ్యారెంటీలు అన్ని తుపాకీ మాటలేనని ఆరోపించారు. మీ మోసాలకు గుణపాఠాలు…
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. మంగళవారం పొదిలి మండలంలోని ఓబులక్కపల్లి, కొండాయపాలెం, సలకనూతల, దొడ్లేరు, మూగచింతల, భట్టువారిపాలెం, మాదిరెడ్డిపాలెం, నందిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు పాల్గొన్నారు.
Amit Shah: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపు (గురువారం) కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు.
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం పెద్దెముల్ మండలం గొట్లపల్లి, తట్టెపల్లి గ్రామాల్లో ఎంపీ రంజిత్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు టీ.రాంమోహన్ రెడ్డి, బి. మనోహర్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం…
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు…
విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
బాపులపాడు పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు ప్రజాగళం పేరుతో గన్నవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గత ఐదేళ్లలో జరిగిన మంచిని చూసి ప్రజలందరూ అభివృద్ధికి అండగా నిలవాలని.. సంక్షేమ ప్రభుత్వ విజయానికి సారథులుగా ఉండాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు.