మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మెజారిటీతో సునీతమ్మను గెలిపించాలి అని కోరారు. కంటోన్మెంట్ నుంచి 25 వేల మెజార్టీ ఇవ్వాలన్నారు. సునీతమ్మ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంటి నుంచి 250 వాహనాలతో ర్యాలీ తీశారు. కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది.
Read Also: Samantha : పెళ్లి డ్రెస్సును సామ్ ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?
ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. అవ్వా, తాత, అన్న, చెల్లి అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతానని పట్నం సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.