అమరావతిలో వైసీపీ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం అందించానని తెలిపారు. సీఎం జగన్ పాలనలో చేసిన మంచి, జరిగిన అభివృద్ధి చూసి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Victory Venkatesh: వెంకటేష్‌కి వింత పరిస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం?
వైసీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు చెప్పారు. మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. అక్కచెల్లమ్మలకు ఆసరా కల్పించారని.. అన్నదాతలకు భరోసా ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాలలు బాగు చేసి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని.. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని తెలిపారు.
Supreme Court: భార్య తెచ్చిన “స్త్రీధనం”పై భర్తకు హక్కు లేదు..
అటు.. అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నానని నంబూరు శంకరరావు చెప్పారు. అమరావతిలో రూ. 27 కోట్లతో సంక్షేమ పథకాలు అందజేశామని.. రూ. 23 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్ గా మార్చి మీ చేతుల్లో పెడతానని చెప్పారు. సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు, మరో ఓటు ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ కు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.