తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఇంటి ఇంటికీ తిరుగుతూ.. ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ.. సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ.. తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావును, విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్(చిన్ని) గెలిపించాలని ఆయన కోరారు. ఇక, అడుగడుగునా కొలికపూడికి ప్రజలు బ్రహ్మ రథం పడుతూ.. మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది.. ప్రస్తుతం ఎలా ఉంది అనేదానికి వ్యత్యాసం తెలుసుకోవాలన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తిరువూరు లాంటి పట్నంలో డ్రైనేజీ గానీ, తాగునీటి సమస్య గాని పరిష్కారం కాలేదు అని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు.
Read Also: SRH vs RCB: నువ్ చాలా మంచోడివి ప్యాట్.. కోహ్లీ, కమిన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ (వీడియో)!
ఇలాంటి సమస్యలను చంద్రబాబు నాయుడు వస్తే పరిష్కరిస్తారని.. అలాగే, ప్రజల దగ్గరికి వెళ్లి అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టానని ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి డ్రైనేజీ, రోడ్లు, ప్రతి రోజు కృష్ణ వాటర్ ను ప్రతి ఇంటికి వచ్చే విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయటం వంటి ఈ ఐదు అంశాల కోసం పూర్తి స్థాయిలో పని చేస్తామని తిరువూరు సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.