సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆమె.. ఒకవేళ పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు.
గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది 18 శాతం నేరాలు తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. శుక్రవారం వార్షిక క్రైం రేట్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నమోదైన చోరీ కేసుల్లో సగానికి పైగా కేసులు చేధించామన్నారు. చోరీ కేసులను అధికంగా రికవరీ చేశామని, 949 చోరీ కేసులు నమోదు కాగా 452 కేసులు చేధించామన్నారు. Also Read: Historic Peace Deal: కేంద్రం, ఉల్ఫా మధ్య చారిత్రాత్మక శాంతి…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు
ఆరోజుల్లో అమ్మమ్మలు, అమ్మలు ఎప్పుడూ చీరలో కనిపించేవారు.. కానీ ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళితేనే చీరల్లో కనిపిస్తున్నారు.. మిగతా టైం లో ఎక్కువగా నైటీలలో కనిపిస్తున్నారు.. పెళ్ళైన, పెళ్లి కానీ అమ్మాయిలు అందరు నైటీలను ఎక్కువగా వేసుకుంటున్నారు.. ఇక ఈరోజుల్లో ఆడవాళ్లు వేసుకొనే దుస్తుల విషయంలో ఎటువంటి పరిమితులు, షరతులు లేవు కాబట్టి ఎక్కువగా పగలు రాత్రి తేడా లేకుండానే నైటీలను వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పల్లెలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు అనే తేడా లేకుండా మహిళలు,…
శ్రావణమాసంలో మహిళలు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. దేశంలోని పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తారు.. ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.. ఒక్కో ఆలయంలో ఓ విధంగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేకతను చాటుకుంటాడు.. ఇక ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ఓ అమ్మవారిని ఏకంగా నోట్లతో అలంకరించారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక శ్రీ…