తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడు, ఖండవల్లి గ్రామాలకు చెందిన ఇరువురు వ్యక్తులు బుధవారం కువైట్ దేశంలో బహుళ అంతస్థ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరంలో గల ఈవీఎంలు భద్రత పరిచిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నో మేన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ యూనివర్సిటీ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కాకినాడ జిల్లా తునిలో తండ్రి దాడిశెట్టి రాజా గెలుపు కోసం తనయుడు దాడిశెట్టి శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఈ రోజు నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి.
గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.