Godavari Rail Cum Road Bridge: ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. ఇది గోదారమ్మకు మణిహారం . కొవ్వూరు-.రాజమండ్రికి అపురూప బంధం. ఉభయ గోదావరి జిల్లాలను కలిపిన ఆత్మీయ వారధి ఈ అపురూప రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కూడా ఒక ఇంజినీరింగ్ అద్భుతమే.. ముఖ్యంగా రాజమండ్రి దగ్గర ఈ మలుపు చాలా లెక్కలు వేసి నిర్మించారుట.. ఇండియా లో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి లలో ఇది మూడవది.. మొదటిది అస్సాం లో బ్రహ్మపుత్ర నది పైన, రెండవది సొన్ పూర్ బీహార్ లోనూ… మూడవది మన రాజమండ్రి..కొవ్వూరు మధ్య నిర్మించారు..
Read Also: Telangana Assembly Elections 2023: ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఈసీ.. పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు
1964 మూడవ పంచవర్ష ప్రణాళిక లో కొవ్వూరు – రాజమండ్రి మధ్య రెండు వరుసలు రైల్ మార్గాన్ని నదిపై బ్రిడ్జి ని నిర్మించాలని తీర్మానించారు. అప్పటికి ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాక పోకలు లాంచీల పైనే జరిగేవి. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ సరుకు రవాణా కూడా లాంచీలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలని వినతిని కేంద్రానికి పంపడం, అది ఆమోదం పొందడం చక చకా సర్వే అనుమతులు జెసోప్ కంపెనీ నిర్మాణం మొదలు పెట్టి 1974 ఆగస్టు కి పూర్తి అయింది.
2.8 కిలోమీటర్ల రైల్ మార్గం..4.1 కిలోమీటర్ల రోడ్ మార్గం కలిగిన ఈబ్రిడ్జిని.. నాటి రాష్ట్రపతి ప్రక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో లాంచీల ప్రయాణం ఆగింది.. కొవ్వూరు.. రాజమండ్రి షటిల్ బస్ లు వేశారు.. ఉభయగోదావరి జిల్లాలు ఒకటి అయ్యాయి.. అందుకే గోదారోళ్లకు ఈ బ్రిడ్జి అపురూపం!