AP CM Jagan: ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు.
Also Read: ISRO Chief : గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం
రాజానగరం మండలం దివాన్‌చెరువు డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవ్వనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.