సిఐపై అవినీతి ఆరోపణలు తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక సిఐ గీతారామకృష్ణను వి.ఆర్.కు తరలించారు. సారా కేసులో డబ్బులు తీసుకున్నట్లు సిఐ గీతారామకృష్ణ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమేరకు డిఎస్పీ ఖాదర్ బాషా విచారణ చేపట్టారు. తాత్కాలికంగా ఎటపాక సిఐగా గజేంద్ర రానున్నారు. 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంపు తూర్పుగోదావరి జిల్లాలో రేపటి నుండి మరో 50 ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచారు. ప్రస్తుతం ఆయా రూట్లలో 270 బస్సులు నడుపుతుండగా వీటి సంఖ్యను 320కి పెంచారు.…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ పాజిటీవ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం ఆంధోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భయపెడుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఈ కేసులు 12 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ కేసులు 50 కి చేరాయి. బాదితులు కాకినాడలోని జీజీహెచ్ లో…
కోవిడ్ రోగుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర చాలా కీలకమైనది.. ఆక్సిజన్ సరైన సమయం అందక.. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు వదిలారు.. అయితే, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ అయ్యింది.. దీంతో.. కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు రిస్క్‌లు పడ్డాయి.. మరోవైపు ఆక్సిజన్ లీకేజీని అరికట్టడానికి ఆస్పత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.. దాదాపు గంటన్నర నుంచి అదుపులోకి రావడం లేదని చెబుతున్నారు.. ఇక, ఈ పరిస్థితి స్వయంగా సమీక్షిస్తున్నారు పశ్చిమ గోదావరి జాయింట్ కలెక్టర్ హిమన్సు…
రాజమండ్రిలో జిల్లా కోవిడ్ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ… జిల్లాలో ప్రతీరోజు దాదాపు వెయ్యి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 5 వేల మందికు పరీక్షలు నిర్వహిస్తుంటే 20 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. కోవిడ్ నిబంధనలు ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాలి. రాత్రి కర్ఫ్యూ సమయం సహా అవసరమైతే తప్ప పగలు కూడా ప్రజలు బయట తిరగడం తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సపొందుతుంటే వారి పిల్లలు ఇంటి దగ్గర అవస్థలు…