Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cock Fightings: సంక్రాంతి వచ్చేస్తోంది.. పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, గుండాట.. ఇలా అనేక రకాల ఆటలు ఆడుతుంటారు.. ఇక, కోడి పందాలు కోట్లలో జరుగుతాయి.. కొందరు సర్వం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆమె.. ఒకవేళ పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. పండుగ దినాల్లో కోడి పందాల నిరోధానికి 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. కోడిపందాలతో పాటు ఇతర నిషిద్ధ ఆటలను ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
కోడి పందాల నిషేధ ఉత్తర్వులు అమలకు గ్రామ కమీటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కలెక్టర్ మాధవీలత.. కోడిపందాల నిషేధంపై గ్రామాలలో టామ్ టామ్ వేయించడం, మైక్ ప్రచారం చేయించడం, కరపత్రాలు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. గత సంవత్సరం కోళ్ల పందాల నిర్వహణకు, బరుల ఏర్పాటుకు స్థలాలు ఇచ్చిన భూయజమానులను గుర్తించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నారు అధికారులు.. నిబంధనలను అతిక్రమించి పందాలు జరిగితే గ్రామ, మండల కమిటీలను బాధ్యులుగా చేస్తామని సీరియర్‌గా హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కాగా, ప్రతీ ఏడాది కోడి పందాల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్ గా హెచ్చరించినా.. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కొనసాగుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..