తూర్పుగోదావరి జిల్లాలో శ్రీగంధం చెట్లను అక్రమంగా కొట్టుకుపోయి విక్రయిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు సంచార జీవనం గడిపే యువకులు ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురినీ అరెస్టు చేశారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో మూడు చోట్ల శ్రీగంధం చెట్లను నరికి తరలిస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఎస్సై ప్రేమ్…
Off The Record: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాది వ్యవధిలోనే… తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు ఐఎఎస్ అధికారులు బదిలీ అవడంపై హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నారు. కనీసం పూర్తి పదవీకాలమన్నా ఉంచకుండా… వాళ్ళని ఎందుకు బదిలీ చేశారంటూ ఆరా తీస్తున్నారు చాలామంది. తాజాగా కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌తో ఈ చర్చలు మరింత పెరిగాయి. పోనీ… వాళ్ళమీదేమన్నా తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణలు, అసమర్ధ ముద్రలు ఉన్నాయా అంటే.. అదీ లేదు. దీంతో జిల్లాలో అసలేం…
Crime Love: ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందులో ఒకరు హిజ్రాగా మారడానికి సర్జరీ కోసం దొంగతనాలు చేశారు. ఇంస్టాగ్రామ్ పరిచయంతో భార్యాభర్తల్లా కలిసి ఉంటున్నారు. చోరీలు బయటపడడంతో పోలీసులకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సతీష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా యాదవోలు. 3 ఏళ్ల కిందట కాకినాడ జిల్లా తునికి వచ్చాడు. తాను అమ్మాయిగా మారాలని అనుకుంటున్నానని.. శరీరంలో ఆ లక్షణాలు ఉన్నాయని లోకల్‌గా ఉన్న హిజ్రాలతో కలిశాడు. శరీరంలో…
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరంలో ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300కి పైగా చిత్రాలకు సాక్షిగా నిలిచిన ఈ నిద్రగన్నేరు వృక్షం, దర్శకులు, నటులు మరియు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోవడంతో సినీ ప్రియులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టును కాపాడాలని…
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎరువుల సరఫరాలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
Wedding Drama: ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బయటపడింది. రెండో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిపై మొదటి భార్య కంప్లెయింట్ ఇవ్వడంతో దెబ్బకు పెళ్లి వదిలి పెట్టి పారిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నిత్య పెళ్లికొడుకును పట్టుకుని కఠినంగా శిక్షించాలని వధువు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన సత్యనారాయణకు గోపాలపురం మండలంలోని యువతితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఆ ఘడియలు…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ప్రీమియర్స్ కోసం ఏపీలో భారీగా షోలు వేస్తున్నారు. గతంలో ఏ సినిమాకు వేయనన్ని ప్రీమియర్స్ హరిహరకు దక్కాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో వీరమల్లుకు పడుతున్న ప్రీమియర్స్ షోలు, ఇక్కడి టికెట్ రేట్లు, ఇక్కడ జరిగిన బిజినెస్ లెక్కలు హైలెట్ అవుతున్నాయి. ఏపీలో హరిహర వీరమల్లు…
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచనతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం అమ్మ నుంచి పథకం ద్వారా వచ్చే డబ్బులు మా నాన్నకు ఇవ్వండి అంటూ అక్కాచెల్లెళ్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఐదేళ్లుగా నాన్న వద్ద ఉంటున్నామని.. తల్లి తమను వదిలి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు..