ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.. విగ్రహావిష్కరణ ఇప్పటికే వివాదాస్పదం కాగా.. విగ్రహావిష్కరణ రోజునే విషాదం మిగిల్చింది. విద్యుత్ షాక్ నలుగురిని విగత జీవులుగా మార్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
Kandula Durgesh: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రం సమీపంలో పిడుగు పాటు ధాటికి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Nimmala Ramanaidu: మానవత్వం అనురాగం మరిచిపోయిన వ్యక్తిని సీఎంగా చేసామా అని ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరానికి ఉరి అని 45.72 నుంచి 41.15కు తగ్గిస్తున్నట్టు ఇవాళే చూసినట్టు రాసారు.. అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో నేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసాం..
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెంది ఓ ఇల్లాలి ప్రాణం కూడా తీసింది ఇన్‌స్టాగ్రాం పరిచయం.. తెలియని వ్యక్తితో పరిచయం పెంచుకున్న వివాహిత.. చాటింగ్ మోజులో పడిపోయింది.. తన జీవితాన్నే కోల్పోయింది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తికి నాలుగు లక్షల నగదు, బంగారం ఇచ్చేసింది.. దీంతో.. ఇంట్లో గొడవలు ప్రారంభం అయ్యాయి.. చివరకు ఆమె ప్రాణాలు తీసుకుంది..
Drugs: తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తో పట్టుబడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి భూపాలపట్నం దగ్గర గెస్ట్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీకి తాడేపల్లిగూడెంకు చెందిన యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చారు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో వృద్ధ దంపతులు ప్రాణాలను కోతి తీసింది. ఫురుగు మందుల ప్యాకెట్ తీసుకుని వచ్చి వృద్ధ దంపతులు పేరట్లో పారేసిన కోతి.. అయితే, టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకొని టీ తాగిన వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) వృద్ధ దంపతులు మృతి చెందారు.
East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో వృద్ధులు ఇళ్లను టార్గెట్ గా చేసి చోరీలకు పాల్పడుతున్న ముఠాను అనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. 18 కేసుల్లో ముద్దాయిగా ఉన్న రాజమండ్రి రూరల్ వేమగిరికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర, చక్ర జగదాంబలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.