Rajahmundry Road Cum Railway Bridge: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై నేటి నుండి రాకపోకలు పునరుద్దరించారు. రెంఢు కోట్ల 10 లక్షల రూపాయాల వ్యయంతో చేపట్టిన మరమ్మతు పనులు చేపట్టి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. 4 పాయింట్ 4 కిలో మీటర్లు పొడవైన ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతి పొడవైనది. 45 రోజులుగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడిన వాహనదారులు ఇప్పుడు సాపీగా ప్రయాణం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీలో చారిత్రక నేపథ్యం ఉన్న అతి కొద్ది భారీ వంతెనల్లో రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన కూడా ఒకటి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బహుళ ప్రయోజన వంతెన మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా.. కింద రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. చక్కగా ఒంపు తిరిగి ఉండే ఈ వంతెన గోదావరి జిల్లాలకు మణిహారంలా ఉంది.
Read Also: Chandra Mohan Died: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత!
ఇక, రాజమండ్రి-కొవ్వూరు మధ్య దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెన దశాబ్దాలుగా గోదావరి జిల్లాల ప్రజలతో పాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు, పర్యాటకులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంది.. అయితే, గతంలో పోలిస్తే భారీగా రాకపోకలు పెరిగాయి. అలాగే భారీ వాహనాల్ని కూడా తట్టుకునే సామర్ధ్యం ఉండటంతో ఇరు జిల్లాల నుంచి భారీ వాహనాలు దీనిపై రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో.. కొన్ని మరమ్మత్తులు చేసినా తిరిగి రిపేర్లు తప్పడం లేదు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకుని.. రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి పై భారీ వాహనాల రాకపోకలకు అనుమతిని నిషేధించారు. భారీ వాహనాలను గామన్ బ్రిడ్జిపైకి మళ్లిస్తున్నారు. ఇక మరమ్మతులు కూడా పూర్తి చేసి.. 45 రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం అయ్యాయి.