Cyclone Michaung: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రేపటికి తుఫాన్‌గా మారనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని, తీరప్రాంత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్టు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంది. ఈనెల 4న సాయంత్రానికి చెన్నై- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశమున్నట్టు ఐఎండీ అంచనా వేసింది.
Read Also: Rajamouli-Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో తమిళ్ స్టార్ హీరో..?
మరోవైపు మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే తీర ప్రాంతాల్లో తుఫాన్ నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేశారు. అటు తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి, నౌకలతో సిద్ధంగా ఉంచింది. ఇక తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో పౌరసరఫరాల విభాగం ద్వారా నిత్యావసర సరకులు కూడా అందించేలా చర్యలు చేపట్టింది. ఏటిగట్లు, వంతెనలు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎస్. విద్యుత్, టెలికాం, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్…పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
మిచౌంగ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. తీర ప్రాంత అధికారులతో కలెక్టర్ దినేష్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్.. మత్స్యకారులను వేటకు వెళ్ల వద్దని ఆదేశాలు జారీ.. ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. ఇక, కలెక్టరేట్ లో 1077 కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.. మరోవైపు.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యింది.. నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. కలెక్టరేట్‌లో 1077… 0861 2331261 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.. ఈ నెల 7వ తేదీ వరకూ కంట్రోల్ రూమ్ లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని కలెక్టర్ హరి నారాయణన్ సూచించారు. ఇక, చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులకు సెలవులను రద్దుచేశారు.
Read Also: Votes Counting: రేపే కౌంటింగ్.. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇక, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తూర్పుగోదావరి జిల్లాలో డిసెంబర్ 4 నుండి 6 వరకు వర్షపాతం భారీగా నమోదు అయ్యే హెచ్చరికలు ఉన్నాయి.. దీంతో, ఖరీఫ్ సీజన్ పంట కోతలు రైతులను అప్రమత్తంగా ఉండాలని.. మండల పరిధిలోని తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయ అనుబంధ అధికారులు మండల ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కలెక్టరేట్, డివిజన్, మండల పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రాజమండ్రి కలెక్టరేట్ లో 8977935609, రాజమండ్రి ఆర్డీవో 0883-2442344, ఆర్డీవో కొవ్వూరు 08813231488 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ మాధవీలత తెలిపారు.