భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.
Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. అయినా ఎక్కడా తగ్గకుండా కిమ్ నార్త్ కొరియా నుంచి తన ప్రత్యేక రైలులో రష్యా వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా కిమ్ దేశాన్ని వదిలి రష్యా పర్యటనకు…
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్‌ల సహాయంతో వర్క్‌సైట్‌లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు.
డ్రోన్లను ఉపయోగించి పాక్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్‌లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు పేర్కొంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సిద్దం అవుతున్నది. ఈనెల 29 వ తేదీన బీటింగ్ రీట్రీట్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. అయితే, ఈసారి బీటింగ్ రీట్రీట్ వేడుకల కోసం ప్రత్యేకంగా డ్రోన్ లు ఆకట్టుకోబోతున్నాయి. సుమారు వెయ్యి డ్రోన్‌లు ఈ వేడుకలలో పాల్గొంటున్నాయి. వీటికి ప్రత్యేకంగా అమర్చిన లేజర్ లైటింగ్ ద్వారా లేజర్ షోను నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డ్రోన్ సహాయంతో ఇలా లేజర్‌షోను నిర్వహిస్తున్నారు.…