ఇటీవలే యూఏఈ రాజధాని అబుదాబీలో డ్రోన్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు. యెమన్‌కు చెందిన హుతీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. నెల రోజులపాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. డ్రోన్‌లను ఎరగవేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఎవరైనా సరే డ్రోన్‌లను ప్రయోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని…
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…
దేశంలో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రక్షణ, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాలలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో దీనికోసం కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రణాళికలు తయారు చేసింది. విమానాల నియంత్రణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్నది. అయితే, డ్రోన్‌లను మానవ రహిత విమానాలుగా పిలవాల్సి ఉంటుంది కాబట్టి వీటికోసం ప్రత్యేక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతుంది. ఈ సమయంలో డ్రోన్ ల ద్వారా ప్రైమరీ హెల్త్ సెంటర్ లకు మందులు, వాక్సిన్ సరఫరా చేయాలనీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ప్రయోగాత్మకంగా మొదట తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 11 న లాంఛనంగా వికారాబాద్ లో…
గత కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్‌లు రహస్యంగా భారత్ భూభాగంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. జమ్మూకాశ్మీర్‌లోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తరువాత, భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ నిత్యం జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోనులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ డ్రోన్‌లకు చెక్ పెట్టేందుకు డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది. Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి.. ఇప్పటికే పలు దపాలుగా ఆయల పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మళ్లీ ఎగిరాయి డ్రోన్లు.. ఇక, డ్రోన్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.. అయితే, శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నాయి.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది…
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి… శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు.. డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు.. అయితే, నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు… అర్ధరాత్రి పూట డ్రోన్లు తిరగడంతో శ్రీశైలంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు..…