Kim Jong Un: కిమ్‌కి రష్యా గిఫ్ట్స్.. అవి ఏంటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటన ప్రపంచవ్యాప్తంగా ముఖ్యం అమెరికా, వెస్ట్రన్ దేశాలకు కోపం తెప్పించింది. అయినా ఎక్కడా తగ్గకుండా కిమ్ నార్త్ కొరియా నుంచి తన ప్రత్యేక రైలులో రష్యా వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా కిమ్ దేశాన్ని వదిలి రష్యా పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కిమ్ తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపారు.
Read Also: Jupiter: గురుగ్రహంపై భారీ ఫ్లాష్ లైట్.. ఏమై ఉంటుంది..?
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఇరు దేశాల మధ్య ఆయుధ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. రష్యా, ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్, యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుకుంటోంది. బదులుగా రష్యా నుంచి శాటిలైట్, న్యూక్లియర్ సబ మెరైన్ టెక్నాలజీని నార్త్ కొరియా కోరుతోంది. శనివారం కిమ్ వ్లాడివోస్టాక్‌లో రష్యా రక్షణ మంత్రిని కలిసిన హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థతో సహా అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు. కొమ్సోమోల్స్క్‌లోని ఫైటర్ జెట్ ఫ్యాక్టరీని కూడా కిమ్ పరిశీలించారు. ఆదివారం వ్లాడివోస్టాక్‌లో చదువుతున్న ఉత్తర కొరియా విద్యార్థులతో కూడా కిమ్ సమావేశమయ్యారు. అంతకుముందు వెస్ట్రన్ దేశాలకు పుతిన్ సాగిస్తున్న పోరుకు కిమ్ మద్దతు తెలిపారు.
ఇదిలా ఉంటే ఉత్తరకొరియా అధినేతకు రష్యా కొన్ని విలువైన గిప్టులను బహూకరించింది. ఆరు డ్రోన్లను, బుల్లెట్ ఫ్రూఫ్ చొక్కాను బహూకరించినట్లు అక్కడి వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఆరు డ్రోన్లలో 5 కామికేజ్ డ్రోన్లు కాగా, ఒకటి నిలువగా ఎగిరే Geran-25 నిఘా డ్రోన్ ఉంది. వీటన్నింటిని ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న ప్రిమోరీ ప్రాంత గవర్నర్ కిమ్ జోన్ ఉంగ్ కి అందించారు. వీటితో పాటు థర్మల్ కెమెరాల ద్వారా గుర్తించబడని ప్రత్యేక దుస్తుల్ని కూడా అందించినట్లు రష్యా మీడియా టాస్ తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..